భారీ అంచనాలతో ఇంగ్లంగ్ గడ్డ మీద అడుగుపెట్టింది ఇండియన్ క్రికెట్ జట్టు. టీ-20 సిరీస్‌ను గెలిచిన ఇండియా వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. టెస్ట్ సిరిస్ విషయానికి వస్తే మొదటి టెస్ట్ యాచ్‌లో తృటిలో విజయం చేజార్చుకుంది. ఇక రెండో టెస్ట్‌లో భారత బ్యాట్మెన్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. లార్డ్స్ టెస్టులో టీమిండియా నిండా కష్టాల్లో మునిగింది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేసే దశ నుంచి భారీ ఆధిక్యం కోల్పోయిన స్థితికి చేరింది.
ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి అండగా నిలుస్తూ జట్టును గట్టెక్కించిన వికెట్ కీపర్ బెయిర్‌స్టో (93)త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడో రోజు శనివారం వెలుతురు మందగించి ఆట నిలిపి వేసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 357 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. వోక్స్‌తో పాటు స్యామ్ కరన్ (24 బంతుల్లో 22 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
