- Advertisement -

టీ మిండియాను వెంటాడుతున్న వ‌రుణుడు

- Advertisement -

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందుగా టీమ్ ఇండియా ..నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అడిలైడ్‌లో వచ్చేనెల 6 నుంచి జరిగే తొలిటెస్ట్ మ్యాచ్‌కు సన్నాహకంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో బుధవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే విరాట్ సేణ‌ను వ‌ర‌ణుడు వ‌ద‌ల‌డంలేదు.

ఇప్పటికే రెయిన్ ఎఫెక్ట్‌తో మూడు మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ సిరీస్‌ను సమం చేసుకున్న భారత జట్టు….టెస్ట్ సిరీస్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని పట్టుదలతో ఉంది. కెట్ ఆస్ట్రేలియా బోర్డ్ ఎలెవన్ జట్టుతో జరగాల్సిన వామప్ మ్యాచ్‌ను సైతం విడిచిపెట్టలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో సిడ్నీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ గ్రౌండ్‌ పూర్తిగా తడిసింది. దీంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు.కెట్ ఆస్ట్రేలియా బోర్డ్ ఎలెవన్ జట్టుతో నాలుగు రోజులు ఆడాల్సిన వామప్ మ్యాచ్‌లో మూడు రోజులే మిగిలాయి.

ఇక మిగిలింది మూడు రోజులే కాబ‌ట్టి ఆట భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. దాని ఆదారంగానే మొద‌టి టెస్ట్ సిరీస్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌నుంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ సిరీస్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -