Saturday, May 4, 2024
- Advertisement -

డుప్లెసిస్ చిత‌క్కొట్టుడు …టీమిండియా విజ‌య‌ల‌క్ష్యం 270..

- Advertisement -

డర్బన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 269 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా ఆడి సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో హషీమ్ ఆమ్లా 16, డికాక్ 34, డుప్లెసిస్ 120, మార్క్‌రం 9, డుమిని 12, డేవిడ్ మిల్లర్ 7, క్రిస్ మార్రిస్ 37, ఆండిలె 27 (నాటౌట్), రబాడా 1, మార్కెల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కి 3, చాహెల్‌కి 2, బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకి తలో వికెట్ లభించాయి.

సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ఒంటిరి పోరాటంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. 30 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును డుప్లెసిస్ ఆదుకున్నాడు. మరోవైపు తన తోటి ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా తను మాత్రం పటిష్టంగా బ్యాటింగ్ చేశాడు. ఒక దశలో ఓపెనర్ డికాక్ డుప్లెసిస్‌తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కానీ ఈ భాగస్వామ్యానికి చహాల్ బ్రేక్ వేశాడు. చహాల్ వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతికి డికాక్(34) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డివిలియర్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్క్‌రం 9 పరుగులు మాత్రమే చేసి చహాల్ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత జేపీ డుమిని(12), మిల్లర్(7) పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ మోరిస్(37) గ్రౌండ్‌లో కాసేపు మెరుపులు మెరిపించి కుల్దీప్ బౌలింగ్‌‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో భారీ షాట్లతో పరుగుల వరద పారించిన డుప్లెసిస్(120) ఆఖరి ఓవర్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 3, చహాల్ 2, భువనేశ్వర్, బుమ్రా 1 వికెట్లు తీశారు. తొలి వన్డేలో విజయం సాధించాలంటే భారత్ 269 పరుగులు చేయాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -