Friday, April 19, 2024
- Advertisement -

వన్డే పోరు కు సిద్దమైన ఇరు జట్లు !

- Advertisement -

టీమిండియా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్ లో ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ చేజార్చుకున్నప్పటికి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా వన్డే పోరుకు సిద్దమౌతోంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ” ది ఓవల్ ” మైదానం వేధికగా మొదటి వన్డే నేడు జరగనుంది. సాయంత్రం 5:30 ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా.. అలాగే బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లు కూడా వన్డే సిరీస్ ను కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బల బలాల విషయానికొస్తే ఇరు జట్లు పటిష్టంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ జట్టు టి20 సిరీస్ చేజార్చుకోవడంతో వన్డే జట్టుపై కసిగా ఉంది. దాంతో టి20 సిరీస్ కు విశ్రాంతినిచ్చిన బెన్ స్ట్రోక్స్, జో రూట్, బెయిర్ స్టో, వంటి బలమైన ఆటగాళ్లను వన్డేల కోసం రంగంలోకి దించనుంది. దాంతో ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత పరిష్టంగా మారింది..

ఇక టీమిండియా విషయానికొస్తే.. వన్డేలకు విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టి20 మ్యాచ్ లలో గాయం కారణంగా వన్డేలలో తొలి మ్యాచ్ కు కోహ్లీ దూరం అవుతాడనే వార్తాలు క్రీడా సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక కేవలం వన్డేల కోసమే శిఖర్ ధావన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో హర్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి వారు అద్బుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇక టి20 సిరీస్ లో అద్బుతమైన ఆటతీరు కనబరిచిన సూర్య కుమార్ యాదవ్ కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. దాంతో టీమిండియా బ్యాటింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా తో పాటు, భువనేశ్వర్ కుమార్ లేదా మహ్మద్ షమి ఎవరో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా తుది జట్టులో కనిపించనున్నారు. ఇక ఈ వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ గెలిచి సిరీస్ ను శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది.

Also Read

కింగ్ కోహ్లీ కి గడ్డుకాలం .. ఇక కష్టమే ?

భారత్ కు నిరాశ.. క్లారిటీ ఇచ్చిన రోహిత్ !

పెట్రోల్ బంక్ లో మాజీ క్రికెటర్ చేసిన పనికి షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -