Tuesday, May 14, 2024
- Advertisement -

స‌ఫారీ గ‌డ్డ‌పై కోహ్లీసేన పాత చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తుందా….?

- Advertisement -

దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఇప్పటికే రెండు వరుస వన్డేల్లో గెలిచి 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు.. మూడో వన్డేలో కూడా విజయం సాధించి మరింత ముందుకు దూసుకుపోవాలని భావిస్తోంది. బుధవారం కేప్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య సాయంత్రం గం. 4.30 ని.లకు మూడో వన్డే ఆరంభం కానుంది.

డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కోహ్లి సేన మూడో వన్డేలో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.

మూడో వ‌న్డేలో కోహ్లీసేన విజ‌యం సాధిస్తే చ‌రిత్ను సృష్టించ‌న‌ట్టే. దక్షిణాఫ్రికాలో జరిగిన ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ భారత్ జట్టు ఇప్పటి వరకు రెండు వన్డేల కంటే ఎక్కువ గెలవలేదు. 1992-93‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ జరగగా.. టీమిండియా రెండు వన్డేలు మాత్రమే గెలిచింది. 2010-11 పర్యటనలోనూ ఇదే ఫలితం పునరావృత‌మైంది. దీంతో దశాబ్దాల రికార్డుని తిరగరాసే సువర్ణావకాశం ఇప్పుడు కోహ్లిసేన ముందు నిలిచింది.

ఇప్పటికే గాయాలతో ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌ దూరం కాగా మరొక కీలక ఆటగాడు డీకాక్‌ సైతం మణికట్టు గాయంతో మొత్తం భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో సఫారీ జట్టును గాయాల బెడద ఆందోళన పరుస్తోంది. మరొకవైపు భారత్‌ జట్టు వరుసగా మూడు విజయాలు (టెస్టు మ్యాచ్‌లో విజయంతో కలుపుకుని) సాధించి తదుపరి పోరుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది

మూడో వ‌న్డేలో కూడా భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేల్లో ఆడిన తుది జట్టుతోనే మూడో వన్డేలో కూడా భారత్‌ ఆడటం దాదాపు ఖాయం. వన్డే సిరీస్‌లో ఇప్పటికే కోహ్లి, శిఖర్‌ ధావన్‌, రహానేలు ఫామ్‌ను చాటుకోగా, రోహిత్‌ శర్మ నుంచి కీలక ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌లు తమదైన ముద్రతో చెలరేగిపోతున్నారు. తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ సత్తాచాటుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -