- Advertisement -

ఢిల్లీ ప‌త‌నాన్ని శాసించిన క‌ర్రాణ్‌..

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మరోసారి ఛేదనలో త‌డ‌బ‌డింది.కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మొహాలి వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖర్లో ఒత్తిడికి త‌లొగ్గి 14 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాల‌య్యింది.పంజాబ్ కుర్ర కెరటం స్యామ్ కర్రాన్, స్వింగ్ సుల్తాన్ షమీ అద్భుతం చేశారు. ఎనిమిది పరుగుల తేడాతో ఢిల్లీ ఎనిమిది వికెట్లు పడగొట్టి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టారు. తన తొలి ఓవర్లో నిరాశపరిచిన కర్రాన్..మలి రెండు ఓవర్లలో కేక పుట్టించాడు. హ్యాట్రిక్ ఫీట్‌తో ఢిల్లీని గడగడలాడించి పంజాబ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే విజయాన్నందించాడు.

ఛేదనలో ఢిల్లీ జట్టు విజయానికి ఆఖరి 24 బంతుల్లో 30 పరుగులు అవసరమవగా.. అప్పటికి చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ.. 137/3 నుంచి వరుసగా రిషబ్ పంత్ (39: 26 బంతుల్లో 3×4, 2×6), ఇంగ్రామ్ (38: 29 బంతుల్లో 4×4, 1×6)తో పాటు మోరీస్ (0), హనుమ విహారి (0), హర్షల్ పటేల్ (0), రబాడ (0), సందీప్ (0) వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు 19.2 ఓవర్లలోనే 152 పరుగులకి ఆలౌటైంది. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ (4/11) డెత్ ఓవర్లలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి పంజాబ్‌కు విజ‌యాన్ని అందించారు.

అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ లోకేశ్ రాహుల్ (15: 11 బంతుల్లో 2×4, 1×6), శామ్ కరన్ (20: 10 బంతుల్లో 3×4, 1×6)తో మయాంక్ అగర్వాల్ (6) నిరాశపరిచాడు. మిడిల్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (43: 30 బంతుల్లో 4×4, 2×6), సర్ఫరాజ్ ఖాన్ (39: 29 బంతుల్లో 6×4), ఆఖర్లో మన్‌దీప్ సింగ్ (29 నాటౌట్: 21 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడటంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.

ఢిల్లీ బౌలర్లలో మోరీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ, స్పిన్నర్ సందీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మయాంక్ అగర్వాల్ , మహ్మద్ షమీ (0) రనౌటయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -