- Advertisement -

జింబాబ్వేపై భారత్‌ గెలవడమే కాదు..రన్‌రేట్!

- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు నెట్ రన్‌రేట్ (NRR) తీవ్రంగా పడిపోయింది. ప్రస్తుతం భారత జట్టు NRR -3.8గా ఉంది. గురువారం (ఫిబ్రవరి 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగే సూపర్ 8 మ్యాచ్ భారత్‌కు తప్పనిసరి విజయం మాత్రమే కాకుండా భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  1. 150 పరుగుల లక్ష్యాన్ని 11 ఓవర్లలో చేధిస్తే

జింబాబ్వే 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే, భారత్ దాన్ని 11 ఓవర్లలోనే చేధించాలి. ఆధునిక టీ20 క్రికెట్‌లో ఇది కష్టమైనదే అయినా అసాధ్యం కాదు. వెస్టిండీస్ జట్టు ఇటీవల జింబాబ్వేపై 150 పరుగులను 13 ఓవర్లలోనే చేధించింది. అదే తరహాలో భారత్ ఆడితే NRR మెరుగుపడే అవకాశం ఉంది.

  1. 180 లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో చేధించాలి

జింబాబ్వే 180 పరుగులు చేస్తే, భారత్ కేవలం 70 బంతుల్లో (11.4 ఓవర్లు) లక్ష్యాన్ని అందుకోవాలి. ఇది అత్యంత క్లిష్టమైన పని. లక్ష్యం పెరిగే కొద్దీ NRR మెరుగుపరచడం మరింత కష్టమవుతుంది.

  1. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే

చేజింగ్ చేయడం NRR కోసం అనుకూలం. కానీ భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 200 పరుగులు చేయాలి. ఆ సందర్భంలో జింబాబ్వేను 124 పరుగుల కంటే తక్కువకు కట్టడి చేయాలి. భారత్ 180 మాత్రమే చేస్తే, ప్రత్యర్థిని 104 లోపే ఆపాలి.

  1. NRR అవసరం లేకుండా ఉండాలంటే?

దక్షిణాఫ్రికా తమ మిగతా మ్యాచ్‌లన్నింటిని గెలిస్తే, భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు. అప్పుడు రన్‌రేట్ లెక్కలు అవసరం లేకుండానే సెమీఫైనల్‌కు అర్హత సాధించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -