ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని ఆటకు విరామం ఇచ్చి ..గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌లో ఆర్మీతో కలసి విధులు నిర్వహిస్తున్నారు. విండీస్ టూర్ నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15వరకు అక్కడే ఉండే ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లేహ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
ఇదలా ఉంటే ధోనీకి అతడి భార్య సాక్షి అద్భుతమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. ధోనికి ఇష్టమైన జీప్ గ్రాండ్ చెరోకీ’ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ధోనీకి ఆ విషయాన్ని తెలియజేసింది. ‘మొత్తానికి నీకిష్టమైన #redbeast ఇంటికొచ్చింది. దానికి స్వాగతం. మహీ నిన్ను నిజంగా చాలా మిసవ్వుతున్నా!. భారత్‌లో ఈ మోడల్ కారు ఇదే మొదటిది కావడంతో దాని పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నా.’ అంటూ పేర్కొంది. ధోనికి బైక్ లన్నా, కార్లన్న ఇస్టపడతాడు. ఇప్పటికే అతని షెడ్డులో ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్2, జీఎంసీ సీరా వంటి కార్లు ఉండగా బైకుల్లో.. కవాసాకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ హెల్‌కాట్, బీఎస్ఎ, సుజుకీ హాయాబుసా వంటివి ఉన్నాయి.
