Tuesday, May 14, 2024
- Advertisement -

క్రికెట్‌లో ‘మీటూ’ ప్ర‌కంప‌న‌లు… క‌ఠిన నింధ‌న‌లు తీసుకురానున్న బీసీసీఐ

- Advertisement -

మీటూ ఉద్య‌మం యావ‌త్ భార‌తాన్ని వ‌ణికిస్తోంది. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ ఉద్య‌మం ఇప్పుడు అన్ని రంగాల‌కు పాకింది. సినీ ఇండస్ట్రీతో పాటు మీడియా, రాజకీయ, క్రీడా రంగాల్లో ‘మీటూ’ మూమెంట్ పెను భూకంపాన్ని క్రియేట్ చేస్తోంది.బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీతో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ, పేసర్ లసిత్ మలింగాలపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోప‌ణ‌న‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది.మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, మీడియా వ్యక్తులు, కాంట్రాక్టర్లు… ఇలా ఎవ్వరైనా సరే, లైంగిక ఆరోపణలు రుజువైతే వారిని ఈవెంట్ల నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకుంది.

ముఖ్యంగా మహిళా క్రికెట్ జట్లలోని సభ్యులకు ఎలాంటి చేదు అనుభవాలు కలగకుండా కఠిన నియమ నిబంధనలు రూపొందించే పనిలో ఉంది ఐసీసీ. మహిళా సంరక్షణ కోసం చేపట్టాల్సిన విధి విధానాల రూపకల్పన విషయమై సింగపూర్ త్రైమాసిక మీటింగ్‌లో డిస్కర్షన్ చేయనున్నారు.మహిళా రక్షణతో పాటు చిన్నారుల సంరక్షణ గురించి కూడా ఈ ఐసీసీ మీటింగ్‌లో చర్చించబోతున్నారు.
నవంబర్ 9 నుంచి వెస్టిండీస్‌లో ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ జరగబోతోంది. ఆ లోపు ఈ కొత్త నియమావళిని అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది ఐసీసీ. ఇకపై ఇలాంటి తలెత్తకుండా కఠిన నియమాలు ఉపయోగపడాతాయని ఐసీసీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -