Sunday, May 26, 2024
- Advertisement -

మ్చాచ్ ఫిక్సింగ్‌, వివాహేత‌ర సంభందాలై క్రికెట‌ర్ ష‌మీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు…

- Advertisement -

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ మరిన్ని కష్టాలను ఎదుర్కోనున్నాడు. వాహేతర సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడకు అవినీతి, ఫిక్సింగ్ కేసు చుట్టుకుంది. భార్య చేసిన ఆరోపణల్ని విశ్వసించిన బీసీసీఐ బౌలర్ షమీపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక-భద్రతా విభాగాన్ని (యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్‌)ఆదేశించింది.

దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన వివరాలు అందించాలని పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. ‘భారత జట్టు దక్షిణాఫ్రికా నుంచి వెనక్కి వచ్చే సమయంలో షమీ దుబాయ్‌లో ఆగిపోయాడు. అక్కడే పాకిస్థానీ యువతితో హోటల్లో గడిపాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఇటీవలే సొమ్ము కూడా తీసుకున్నాడ’ని హసీన్ జహాన్ ఆరోపించింది. ఏసీఎస్‌యూ అధిపతి నీరజ్ కపూర్‌ షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు సమాచారం.

షమీతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లను కూడా జహాన్ బయటపెట్టింది. షమీపై ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం విచారణ జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్.. ఏసీఎస్‌యూ అధిపతి నీరజ్ కపూర్‌ షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు సమాచారం

పాకిస్థాన్ యువతి నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడా లేదా అనే విషయం తేల్చాలని వినోద్ రాయ్ ఆ లేఖలో కోరారు. బీసీసీఐ విచారణలో దోషిగా తేలితే.. క్రికెటర్‌గా షమీ కెరీర్ ముగిసినట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -