Saturday, May 4, 2024
- Advertisement -

క్రికెట్ మహాసంగ్రామం…మూడోసారి గెలిచేనా?

- Advertisement -

క్రికెట్ మహా సంగ్రామం నేటి నుండి మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది న్యూజిలాండ్. ఆదిలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కెన్ విలియమ్సన్ తొలి మ్యాచ్ కు గాయం కారణంగా దూరం కాగా సారథ్య బాద్యతలను లాథమ్ నిర్వర్తించనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో సైతం కీలక ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలున్నాయి.

ఇక వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న తరుణంలో టీమిండియాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్నిరంగాల్లో రోహిత్ సేన టాప్‌లో ఉంది. ఇక తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న సిరాజ్…నెంబర్ వన్ ర్యాంకుతో ఆ డనున్నాడు. సిరాజ్ 669 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తర్వాత ముజీబ్ ఉర్ రెహ్మాన్ 657 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నారు. సిరాజ్ తప్ప టాప్‌ 10 బౌలర్లలో మరే బౌలర్ లేరు.

బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం (857) అగ్ర‌స్థానంలో ఉండగా శుభ్ మ‌న్ గిల్ 839 పాయింట్లతో రెండో స్ధానంలో విరాట్ కోహ్లీ 696 పాయింట్లతో తొమ్మిది, రోహిత్ శ‌ర్మ 695 పాయింట్లతో పదో స్ధానంలో ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్‌లలో హార్ధిక్ పాండ్య 228) పాయింట్లతో ఏడో స్ధానంలో ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుండగా 45 రోజుల పాటు జారీగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 న జరగనుంది. భారత్ ఇప్పటివరకు కపిల్ దేవ్, ధోని సారథ్యంలో ప్రపంచకప్ గెలవగా తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న టీమిండియాపై హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -