Saturday, May 4, 2024
- Advertisement -

చైన్నై సూప‌ర్ కింగ్స్‌పై బెంగుళూరు థ్రిల్లింగ్ విక్టరి

- Advertisement -

ఐపీఎల్ తాజాగా సీజ‌న్‌లో జ‌ట్టు అన్ని నువ్వా నేనా అన్న‌ట్లు ఆడుతున్నాయి. అన్ని జ‌ట్లు విజ‌యం కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఆదివారం రాత్రి అభిమానుల‌కు థ్రిల్లింగ్ మ్యాచ్‌ను అదించాయి చైన్నై సూప‌ర్ కింగ్స్‌, బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్లు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.కోహ్లీ ఔటైనా డివిలియర్స్, పార్థివ్ పటేల్ ధాటిగా ఆడారు.

ఈ క్ర‌మంలో పార్థివ్ పటేల్ అర్థ‌సెంచ‌రీ సాధించాడు. పార్థివ్ పటేల్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 32 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. వాట్సన్, రైనాను స్టెయిన్ వెనక్కి పంపగా.. డుప్లెసిస్, జాదవ్‌లను ఉమేశ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఆ త‌రువాత రాయుడితో జ‌త క‌లిసిన ధోని స్కోరు బోర్డును ముందుకు న‌డిపించాడు. జోరు మీదున్న రాయుడిని చాహల్ ఔట్ చేశాడు.. చివరి ఆరు ఓవర్లలో 76 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా, బ్రావో కూడా పెవిలియన్ చేరడంతో చెన్నై ఓటమి ఖాయమని అనుకున్నారు. ఆఖరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని త‌న బ్యాట్‌కు ప‌ని చెప్పాడు.

ఆఖరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో చివ‌రి ఓవ‌ర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. వరుసగా ఐదు బంతుల్లో 4,6,6,2,6తో 24 పరుగులు చేశాడు. చివ‌రి బంతికి రెండు ప‌రుగులు అవ‌స‌రంగా , ఆ బంతిని చాలా తెలివిగా ఆఫ్ స్టంప్ అవ‌త‌ల వేశాడు ఉమేశ్ యాదవ్. దీంతో అఖ‌రి బంతికి ప‌రుగులు ఏమి రాక‌పోవ‌డంతో బెంగుళూరు ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఓటమికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.

https://www.youtube.com/watch?v=ycJI4miXIJY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -