ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ వైఫల్యం తరువాత టీమిండియా హెడ్ కోచ్ ను మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. వేల దరఖాస్తులు రాగా అందులో అందులో ఆరుగురిని ఫైనల్ ఇంటర్వ్యూల కు సెలక్ట్ చేసింది క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) .
సెలక్ట్ చేసి జాబితాలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, శ్రీలంక కోచ్ టామ్ మూడీ, విండీస్ మాజీ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్థాన్ కోచ్ ఫిల్ సిమన్స్, టీమిండియా మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుట్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ శర్మ ఉన్నారు..
హెడ్ కోచ్ బీసీసీఐ నిబంధనలు..
నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ముందు తుది ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు. ఈ ఇంటర్వ్యూలో తమ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం కోహ్లి అండదండలున్న రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, టామ్ మూడీ, మైక్ హెస్సెన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురుకానుంది.
- కనీసం రెండేళ్ల పాటు టెస్టు టీమ్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేసి ఉండాలి. లేదా.. ఐపీఎల్, అంతర్జాతీయ లీగ్‌లు, ఫస్ట్ క్లాస్ టీమ్‌లు, జాతీయ ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్ల పాటు పని చేసి ఉండాలి.
- కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా.. బీసీసీఐ లెవల్-3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
- వయో పరిమితి 60 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.
