Saturday, May 4, 2024
- Advertisement -

బరిలో 24 ఫుట్ బాల్ జట్లు

- Advertisement -

క్రికెట్ సంగ్రామం తర్వాత సాకర్ వరల్డ్ కప్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న యూరోపియన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కు తెర లేవనుంది. ఈ పోటీల్లో ప్రపంచంలోని పెద్ద ఫుట్ బాల్ జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 24 జట్లు పాల్గొంటున్న ఈ టోర్ని పారిస్ లో జరగబోతోంది. నెల రోజుల పాటు ఫుట్ బాల్ ప్రేమికులకు ఇది పండగే.

యూరప్ ఖండంలో ఫుట్ బాల్ క్రీడలో రారాజు ఎవరో ఈ టోర్నమెంట్ లో తేలనుంది. పది మైదానాల్లో 51 మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ఫ్రాన్స్, రుమేరియాల మధ్య జరుగనుంది.  ఈ రెండు జట్లు గ్రూప్ ఎ లో ఉన్నాయి. 1960లో ప్రారంభమైన ఈ పోటీల్లో అప్పట్లో నాలుగు జట్లు మాత్రమే తలపడ్డాయి. ఆ తర్వాత 1980లో ఎనిమిది జట్లు, 1996లో 16 జట్లు పాల్గొన్నాయి.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఫ్రాన్స్ కు యూరో నిర్వహణ హక్కులు దక్కడం విశేషం. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. టోర్ని విజేతకు 2271 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు. పోటీలో ఉన్న ఒక్కో జట్టుకు 60 కోట్ల రూపాయలు పార్టిస్ పెంట్ ఫీజుగా చెల్లిస్తారు. భారత క్రికెట్ క్రీడాకారుడు, స్టార్ ఆటగాడైన విరాట్ కొహ్లి ఈ టోర్నమెంట్ లో తన ఫెవరెట్ జర్ననీ అంటున్నాడు. జర్మనీ ఈ సారి యూరో విజేత కావడం ఖాయమని కొహ్లి ఆశిస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -