కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో మ్యాచ్ ప్రారంభమైంది. తొలిరోజు వర్షం, వెలుతురు లేమి కారనంగా ఆటను ఆలస్యంగా ప్రారంభించారు. మొదటి రోజు టీమిండియా 11.5 ఓవర్లకు 17 పరుగులు చేసి మూడు వెకెట్లు కోల్పోయింది.
రెండవ రోజు ఆట ప్రారంభం అయిన వెంటనె నాలుగో వికెట్ అజింకా రహానె ఔటయ్యారు. అత్యల్ప స్కోరుకు 3వికెట్లు కోల్పోయిన టీమిండియాపై ఒత్తిడి పెంచేలా శ్రీలంక కెప్టెన్ చండిమాల్ స్లిప్స్ లో ఏడుగురు ఫీల్డర్లను మోహరించాడు. మిడ్ ఆన్, మిడ్ ఆఫ్ లలో ఇద్దర్ని నిలబెట్టి బౌలింగ్ చేయించాడు. దీంతో బౌలర్లు బంతిని కట్టుదిట్టంగా ఆఫ్ స్టంప్ పై వేస్తూ వికెట్లు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో శనక వేసిన బంతిని వెంటాడిన అజింక్యా రహానే (4) కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 30 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా (17) కు జోడీగా రవిచంద్రన్ అశ్విన్ దిగాడు. అశ్విన్ కూడా అవుట్ అవడంతో భారత్ ఐదువికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
తొలిరోజు శిఖర్ ధావన్ (8), కేెఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (0) అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యూహం ఫలించడంతో భారత్ ఐదువికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.
