- Advertisement -
ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించింది టీంఇండియా.ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.కుల్దీప్ స్పిన్ మాయకు రాహుల్ సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో మొదటి మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందిన కోహ్లిసేన.అదే ఊపులో రెండో మ్యాచ్‌కు రెడీ అయింది టీంఇండియా.
ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు యత్నించనుంది. ఓపెనర్లు రోహిత్, ధావన్, మిడిలార్డర్‌లో కోహ్లి, ధోని, రైనా, పాండ్యా చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు తిరుగుండదు. మరోవైపు భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ తమ సామర్థ్యం మేరకు రాణించాలని భావిస్తుంది. కార్డిఫ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి.
