- Advertisement -

కోహ్లికి మిగతా ఆటగాళ్లకు తేడా అదే!

- Advertisement -

వీవీఎస్ లక్ష్మణ్ ఇండియన్ క్రికెట్‌కు మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందించాడు.. ఏళ్ల తరబడి టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్.. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు మాత్రం దూరం కాలేదు. కామెంటేటర్ అవతారం ఎత్తడంతోపాటు, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్యంగా ఆసీస్ బౌలర్లకు చుక్క‌లు చూపించేవాడు.కానీ అలాంటి లక్ష్మణ్‌కు వసీం అక్రమ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాల్‌గా అనిపించిదేట. తాజాగా ల‌క్ష్మణ్ ఆస్క్ ది లక్ష్మణ్ పేరిట నెటిజన్లతో ముచ్చటించిన ముచ్చ‌టించాడు.

కోహ్లికి మిగతా ఆటగాళ్లకు తేడా ఏంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు లక్ష్మణ్ అద్భుతంగా బదులిచ్చాడు. మానసిక బలం, గేమ్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడం, మనసును అదుపులో ఉంచుకోవడం అంటూ లక్ష్మణ్ సమాధానం ఇచ్చాడు. అర్ధ శతకాలను, శతకాలుగా మార్చగలగడం కూడా కోహ్లికి, మిగతా ఆటగాళ్లకు తేడా అని లక్ష్మణ్ చెప్పారు. ఇక ఇంగ్లండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన‌ప్ప‌టికి మిగిలిన టెస్ట్ మ్యాచ్‌ల‌లో తిరిగి పుంజుకుంటుంద‌ని వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -