Sunday, May 5, 2024
- Advertisement -

క్రికెట్ చరిత్రలోనే చెత్త‌ రికార్డ్‌….

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘటన చోటు చేస‌కుంది. ఈ సంఘ‌ట‌న వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విండీస్‌ ప్లేయర్‌ సునీల్‌ అం‍బ్రిస్‌ తన అరంగేట్ర టెస్టులోనే ఓ అరుదైన చెత్త రికార్డును నమోదు చేశాడు.

క్రికెట్‌లో హిట్ వికెట్ గా ఔట్ కావడం సాధారణంగా జరిగేదే. తొలిటెస్ట్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. టెస్ట్ క్రికెట్ లో ఇంత చెత్త రికార్డు ఎవరూ సాధించలేదు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ కే చెందిన సీఎస్ బాహ్ పేరిట ఉండేది. 2003లో తొలి టెస్టు ఆడిన బాహ్ రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులకు హిట్ వికెట్ గా వెనుదిరిగి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చెత్త రికార్డును అంబ్రిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

నీల్ వాగ్నర్ వేసిన 29వ ఓవర్ తొలి బంతిని అంబ్రిన్ ఫైన్ లెగ్ మీదుగా తరలించాడు. అయితే, పొరపాటున అతని ఎడమ కాలు స్టంప్స్ ను తాకింది. దీంతో, అతను ఎంతో నిరాశగా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ తొలి బంతికే అతడిని ఆ విధంగా దురదృష్టం వెంటాడింది. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఎన్నో కలలతో బ్యాటింగ్‌కు దిగిన అంబ్రిస్‌ దురదృష్టం వెంటాడటంతో నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -