- Advertisement -

WPL 2026:మెగా వేలం రెండు రోజుల్లో!

- Advertisement -

2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL మెగా వేలం మరో రెండు రోజుల్లో జరగనుంది. 2025 మహిళల ప్రపంచ కప్‌లో భారత క్రీడాకారులు విజయం సాధించిన నేపథ్యంలో, ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది.

చాలా ఫ్రాంఛైజీలు తమ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఖరారు చేయగా, యూపీ వారియర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక పర్స్ బ్యాలెన్స్‌తో స్క్వాడ్‌ను పునర్నిర్మించడంపై దృష్టి సారించాయి. WPL 2026 వేలంలో మొత్తం 277 మంది క్రీడాకారులు ఉన్నారు, వీరిలో 194 మంది భారతీయులు. అందుబాటులో ఉన్న స్లాట్‌లు 73, వీటిలో 50 దేశీయ క్రీడాకారుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి.

అత్యధిక బేస్ ధర (₹50 లక్షలు): 19 మంది క్రీడాకారులు. ఓవర్సీస్ స్లాట్‌లు: 83 మంది విదేశీ ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వారికి 23 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 27, 2025 (గురువారం)సమయం: మధ్యాహ్నం 3:30 గంటల నుండి వేలం జరగనుంది.

ముంబై ఇండియన్స్‌ – స్కివర్-బంట్ (₹3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (₹2.5 కోట్లు), హేలీ మాథ్యూస్ (₹1.75 కోట్లు), జి. కమలిని (₹50 లక్షలు),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-స్మృతి మంధాన (₹3.5 కోట్లు), రిచా ఘోష్ (₹2.4 కోట్లు), ఎలిస్ పెర్రీ (₹2 కోట్లు), శ్రేయాంక పాటిల్ (₹60 లక్షలు),ఢిల్లీ క్యాపిటల్స్-అనబెల్ సదర్లాండ్ (₹2.2 కోట్లు), మరిజానే కాప్ (₹2.2 కోట్లు), జెమీమా రోడ్రిగ్స్ (₹2.2 కోట్లు), షఫాలీ వర్మ (₹2.2 కోట్లు), నికి ప్రసాద్ (₹50 లక్షలు),గుజరాత్ జెయింట్స్-ఆష్ గార్డ్‌నర్ (₹3.5 కోట్లు), బెత్ మూనీ (₹2.5 కోట్లు)యూపీ వారియర్స్శ్వేతా సెహ్రావత్ (₹50 లక్షలు) రిటైన్ లిస్ట్‌లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -