Saturday, May 4, 2024
- Advertisement -

చైనాలో క్రికెట్ పేరు విని షాక్ తిన్న పాకిస్థానీ యాంక‌ర్‌….

- Advertisement -

చైనాలో క్రికెట్‌ను ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసుకోండి అంటూ టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ తుంటరి వీడియోను పోస్టు చేశాడు. చైనాలో క్రికెట్‌కు అంతగా ఆదరణ ఉండదన్న విషయం అందరికి తెలసిందే. అయితే అనూహ్యంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఇద్దరు చైనా ప్లేయర్లు యూఫై జాంగ్, జియాన్ లీ పెషావర్ జాల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు .

ఈ నేపథ్యంలో చైనాలో క్రికెట్ ఆడుతారా? చైనాలో క్రికెట్ ను ఏమని పిలుస్తారు? అంటూ పీఎస్ఎల్ లో యాంకర్ వారిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. చైనాలో క్రికెట్ ఆడుతారని యూఫై జాంగ్ తెలిపాడు. క్రికెట్ ను చైనాలో ”భాంచో” అంటారని అన్నాడు. దీంతో యంకర్ బిత్తరపోయాడు. పాకిస్థాన్ లో ఆ పదం ఒక బూతు, ఎవరి సోదరినైనా తిట్టాలంటే ఇంచుమించు ఆ పదంతో తిడుతుంటారు. కొంత మంది ఆ బూతును ఊతపదంగా వినియోగిస్తుంటారు. దీంతో ‘ఏమంటారు?’ అని మళ్లీ అడిగి స్పష్టంగా విన్నాడు. దీనిని యువరాజ్ సింగ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ, ‘పంజాబీ పదంలా ఉంది కదా’ అంటూ పేర్కొన్నాడు. ఆ వీడియో చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -