Friday, May 17, 2024
- Advertisement -

బరి తెగించిన బాబు.. ఓడిపోయిన వారే ఎమ్మేల్యేలంటా

- Advertisement -
Chandrababu Naidu Politics

ఏపీ అధికార పార్టీ శైలి ఏపీ ప్రజలను ఆందోళన పెడుతోంది. టీడీపీస్వామ్యం, చంద్రబాబు రాజ్యాంగం.. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయించుకుని.. నలుగురికి మంత్రి పదవి ఇచ్చిన బాబు ఇప్పుడు మరో ఘన కార్యం చేశారు. ఏకంగా ఓడిపోయిన వారిని ఎమ్మెల్యేలుగా చూపిస్తూ జీవోలు జారీ చేసి కోట్లాది రూపాయల నిధులు కట్టబెట్టారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుండి వైసీపీ నుంచి సురేష్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

కానీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో రూపాయి కుడా విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసమంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్ పేరు మీద రెండు కోట్లు విడుదల చేశారు. నిధులు విడుదల చేయడం ఒక ఎత్తు అయితే ఏకంగా ఓడిపోయిన విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా చూపిస్తూ జీవో ఇచ్చారు. ఓడిపోయిన వ్యక్తిని అధికారికంగా ఎమ్మెల్యే అంటూ జీవో జారీ చేసిన ఘనత ప్రపంచంలో టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందంటున్నారు.

బాబు ఏం చేసిన గంగిరెద్దుల్లా తలూపే ఉన్నతాధికారులు కూడా మరింత దిగజారిపోయారు. ఓడిపోయిన వ్యక్తి మీద ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ప్రణాళిక శాఖ ఎక్స్‌ ఆఫిషియో కార్యదర్శి సంజయ్‌ గుప్తా ఈ జోవోను రిలీజ్ చేశారు. ఇది ఏమన్న బాగుందా అని ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణలో పార్టీలతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకు సమానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నారు. వైఎస్ హయాంలోనూ ఎమ్మెల్యేలకు పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేవారు. కానీ రాజకీయంగా మంచి అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ఇలా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -