- Advertisement -

వైకాపా ఎమ్మెల్యే లకి చంద్రబాబు ఓపెన్ ఆఫర్ 

- Advertisement -
chandrababu open offer to YSRCP Mla’s in kadapa tour

కడప జిల్లాలా ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైకాపా లీడర్ జగన్ మోహన్ రెడ్డి మీద సీరియస్ విమర్శలు చేసారు.

పెద్ద నోట్ల రద్దు తో ప్రతిపక్ష పార్టీ నేతలకి వణుకు పుట్టుకొచ్చింది అనీ దాచుకున్న డబ్బు మొత్తం ఏం చెయ్యాలి అనే పరిస్థితి లో వారికి పిచ్చెక్కింది అని చంద్రబాబు అన్నారు. కులాలు మతాల పేరుతో కడప లో అశాంతి కలిగించాలి అని జగన్ ప్రయత్నాలు చేసారు అనీ అవేమీ కుదరలేదు అని బాబు చప్పడం విశేషం. వైఎస్ కుటుంబం కానీ కాంగ్రెస్ కానీ కడప లో ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని తమను ఎవ్వరూ గుర్తించడం లేదని ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు తనను కలిసి మొరపెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకింత గర్వంగా ప్రకటించారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అభివృద్ధికోసం కృషి చేస్తుంటే దివంగత సీఎం వైఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొని అరకొర అభివృద్ధి చేశారని గతం గుర్తు చేశారు. అభివృద్ధిని ఆంకాంక్షించే వైకాపా ఎమ్మెల్యేలు తమ నేతలతో కలిసి సమన్వయంతో పనిచేసేందుకు వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -