“భీష్మ” మూవీ రివ్యూ

590
bheesma movie review in telugu
bheesma movie review in telugu

నితిన్ మరియు రష్మీక హీరో హీరోయిన్స్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “భీష్మ”. భారీ అంచనాలతో ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” సీఈఓ అనంత్ నాగ్ వ్యవసాయ రంగానికి మంచి చేయాలని సరికొత్త పద్దతులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీరికి పోటీగా మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) అడ్డుపడుతుంటాడు. ఈ నేఫథ్యంలో లైఫ్ చాలా బోరింగ్ గా సింగిల్ గా ఫీల్ అవుతున్న భీష్మ(నితిన్).. హీరోయిన్ రష్మీకతో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల చేత భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు నితిన్ చేపడతాడు. అలా చేపట్టాక నితిన్ ఎదుర్కొన్న ఇబ్బందు ఏంటీ ? జిష్షును ఎలా ఎదిరించాడు ? ప్రేమలో గెలిచాడా ? చివరికి ఏమైంది ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ఫస్ట్ ఆఫ్ సరదాగా సాగిపోయింది. మంచి కామెడీతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు నితిన్ లోని ఓ సరికొత్త యాంగిల్ ప్రెజెంట్ చేశాడు. ఆ పాత్రకు నితిన్ కూడా పూర్తిగా న్యాయం చేశాడు. తనదైన కామెడీ టైమింగ్,ఎమోషన్స్ రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్ లోను అదరగొట్టేసాడు. రష్మిక మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రేక్షకులను ఆకర్శిస్తోంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారని చెప్పాలి. ప్రధానంగా కామెడీ సీన్స్ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. అలానే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాగే కీలక నటుడు జిష్షు గుప్త అద్భుతంగా చేశాడు. మిగితనటినటలు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు వెంకీ తన తొలి చిత్రం ’ఛలో’ లానే కామెడీ ఫార్ములాలోనే ’భీష్మ’ను తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఇక మహతి అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : సినిమా చూసే ప్రేక్షకుడు కథను కాస్త ముందే అంచనా వేయగలడు. అక్కడా అక్కడా కథనం కాస్త నెమ్మదించింది.

మొత్తంగా : భీష్మ.. అదిరిపోయే కామెడీ ఎపిసోడ్స్, హీరో హీరోయిన్ మధ్య కెమెస్ట్రీని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. అక్కడ అక్కడ కాస్త లాగ్ సీన్స్ మైనస్. ఇక మొత్తంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా బాగుంది. నితిన్ ఖాతాలో మరో హిట్ పడినట్లే అని చెప్పాలి.

Loading...