Saturday, May 4, 2024
- Advertisement -

కీర దోస అతిగా తింటున్నారా?

- Advertisement -

ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు కీర దోసను ఆహారంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వేసవిలో కీర దోసకాయలను తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. అంతేగాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, జీవక్రియను మెరుగు పర్చడానికి దోహదం చేస్తుంది. దోసకాయలలో కేలరీలు తక్కువగా ఉండి, నీరు-ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది వేసవిలో కీర దోసను తినడానికి ఇష్టపడతారు.

అయితే ఏది అతి అయినా అనర్థమే అన్నట్లు కీర దోసను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కీరదోస తినడం వల్ల ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. అలాగే శరీరంలోని ఫ్యూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి.

కీరదోసలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కానీ.. ఎక్కువగా తినడం వల్ల న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మంపై అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మితంగా తినడం మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -