Monday, May 6, 2024
- Advertisement -

పొంగులేటా..మజాకా!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో తీవ్ర తర్జన భర్జనల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసింది. ముఖ్యంగా ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనగా తన పంతాన్ని నెగ్గించుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఖమ్మం నుండి తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకోగా హైదరాబాద్‌ స్థానం నుంచి మహ్మద్ సమీర్‌కు ,కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇక ఇప్పటికే ఖమ్మం నుండి నామినేషన్ దాఖలు చేశారు రఘురాం రెడ్డి.

ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని లేకపోతే రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇక పొంగులేటి సైతం తన సోదరుడు లేకపోతే రఘురాం రెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదించగా చివరకు పొంగులేటి వైపే మొగ్గుచూపింది కాంగ్రెస్. ఇక తుమ్మల సైతం తన కుమారుడి కోసం పట్టుబట్టిన తర్వాత వెనక్కి తగ్గారు. మొత్తంగా గత ఎన్నికల్లో ఖమ్మం నుండి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి…ఖమ్మం సీటుపై మరోసారి తన మార్క్ చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -