Friday, April 26, 2024
- Advertisement -

కొండ గుహ‌లో …అంధుల రెస్టారెంట్‌….

- Advertisement -

మ‌నం లంచ్ చేయ‌డానికొ డిన్న‌ర్ చేయ‌డానికో రెస్టారెంట్‌ల‌కు వెల్తుంటాము. చూడ‌గానె ఆ రెస్టారెంట్‌లోఉన్న హంగులు అన్నీ ఇన్నీ కావు. కాని మ‌నం ఇప‌పుడు వింటున్న రెస్టారెంట్ అలాంటి ..ఇలాంటి రెస్టారెంట్ కాదండోయ్‌… తెలుసుకుంటె ముక్కున వేలేసుకోవాల్సిందె. అయితె అది మ‌న దేశంలో కాదులెండి విదేశాల్లో.

ఈక్వెడార్‌ రాజధాని క్విటో శివారులోని ఓ గుహఉంది.. రాత్రి ఏడ‌వుతోంది. చుట్టూ చీక‌టి…ఎటువెల్లాలో దారి స‌రిగాతెలియ‌దు. కాని అందులోకి కొన్ని జంట‌లు వెల్తున్నారు.ఇంత‌లోనె ఓ స్వ‌రం వినిపించింది. అంతె ఇంకేముంది గుండె ద‌బేల్ మంది. ఆ చీక‌టిలో ఇటు రండి స‌ర్ అని వాయిస్ విన‌ప‌డింది. ఓ వ్య‌క్తి ఆ చీక‌టి గుహ‌లోనుంచి వ‌చ్చి వారికి దారి చూపుతున్నాడు. తిన్న‌గా ఒక ప్ర‌దేశానికి తీసుకెల్లి అక్క‌డ ఉన్న సీట్ల‌ల్లో కూర్చొ బెట్టాడు. ఇక్క‌డె ఓట్విస్ట్ ఉంది. ఆచిమ్మ చీక‌ట్లో క‌ళ్లున్న వారంద‌రికి దారి చూపించిన ఆ వ్య‌క్తికి క‌ళ్ళులేవు. పూర్తిగా అంధుడు.

అస‌లు విష‌యానికి వ‌స్తె అది క్విటోలోని రఫాస్‌ కేవ్‌ రెస్టారెంట్‌.. డార్క్‌నెస్‌లో డిన్నర్‌ చేయడం వంటి కాన్సెప్టులు చాలా చోట్ల ఉన్నవే.. అయితే.. రఫాస్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వెయిటర్లంతా అంధులే. ఇంకో విశేషమేమిటంటే.. రెస్టారెంట్‌కు తినడానికి వచ్చినోళ్లంతా దేన్నో ఒకదాన్ని తన్నుకుంటూ.. తడబడుతూ నడుస్తుంటే.. అంధులైన వెయిటర్లు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఠీవిగా నడుస్తూ కనిపిస్తారు.

ఇక్కడ సెల్‌ఫోన్లు, కాంతిని వెదజల్లే గడియారాలు వంటివి నిషిద్ధం. అక్కడక్కడా చిన్నపాటి వెలుతురు వస్తుంటుంది.. ఈ రెస్టారెంట్‌ను రాఫెల్‌వైల్డ్‌ అనే ఆయన ప్రారంభించారు. ఓ వినూత్న అనుభూతిని అందించడంతో పాటు అంధుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రెస్టారెంట్‌ను పెట్టినట్లు ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -