’మర్డర్’ సినిమాలో అమృతగా నటిస్తున్న ఈమె గురించి మీకు తెలుసా ?

559
unknown facts of rgv actress avancha sahithi
unknown facts of rgv actress avancha sahithi

ఈ లాక్ డౌన్ టైములో కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాం గోపాల్ వర్మ. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ అన్ని బంద్ పెట్టి సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటే.. వర్మ మాత్రం లాక్ డౌన్ మొదలు అయినప్పటి నుండి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అందులో మొదటిది ‘క్లైమాక్స్’. ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది.

తాజా ’పవర్ స్టార్’ అనే సినిమా తీశాడు వర్మ. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ.. అమృత-ప్రణయ్ ల ప్రేమకథ ను కూడా ‘మర్డర్’ అనే సినిమాగా తెరకెక్కించాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లే ఈ ట్రైలర్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ‘మర్డర్’ లో మారుతీ రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్ కనిపించబోతున్నాడు. ‘బ్రోచేవారెవరురా’ ‘ప్రతీ రోజూ పండగే’ చిత్రాలతో ఈయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక అమృత క్యారెక్టర్ లో కనిపించబోతుంది సాహితి ఆవంచ అనే తెలుగమ్మాయి. ఈమె హైదరాబాద్ కు చెందిన అమ్మాయేనట. సాహితిని హీరోయిన్ గా చూడాలి అనేది ఆమె తల్లి కోరికట. అందుకే బుల్లితెరపై కొన్ని షోస్ చేసే అవకాశం సాహితికి దక్కేలా చేసిందట. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిందట సాహితి. అంతేకాదు.. ’బాయ్’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఇప్పుడు మర్డర్ సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఈమెకు మరింత క్రేజ్ వచ్చేలా కనబడుతోంది.

డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

బుల్లితెర హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

కరోనా తో కుప్పకూలుతున్న జీవితాలు

Loading...