Monday, May 6, 2024
- Advertisement -

జగన్ మద్దతుగా మారుతున్న కమ్మ రాజకీయాలు..!!

- Advertisement -

ఏపీలో కులం ఆధారంగా రాజకీయాలు సాగుతాయని అందరికి తెలిసిందే. రాష్ట్రంలో వివిధ వర్గాలుగా బీసీ లు ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత ఎస్సీలు అధికంగా ఉన్నారు.. ఓసీ వర్గంలో రెడ్డి, కమ్మ, కులాలు తక్కువ శాతం ఉన్నా రాజకీయంగా పైవారికంటే వీరే ఎక్కువగా చక్రం తిప్పుతున్నారని చెప్పొచ్చు.. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలన్నీ ఒకే తరగతి గా భావిస్తే మాత్రం ఎస్సీ సామజిక వర్గం తర్వాత వీరే ఎక్కువగా 13 శాతం ఉన్నారు.. ఇక ఈ తరగతి వారు మొదటినుంచి టీడీపీ కి ఎంతటి విధేయులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి నుంచి టీడీపీ కి వీరు సపోర్ట్ చేస్తూ వచ్చినా గత ఎన్నికల్లో కొంత ఆలోచించారని చెప్పొచ్చు..

దానికి కారణం పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో కమ్మ వారిని కొంత ఆకర్షించిన ఎవరు పవన్ ని నమ్మలేదు.. దాంతో పవన్ ఆటలో అరటిపండులా మిగిలిపోయాడు.. ప్రస్తుతం టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు కాపు నేతలు ఉన్నారంటే వారు టీడీపీ పై ఎంత ఆగ్రహంగా ఉన్నారో చెప్పనవసరం లేదు. ఎన్నికల సమయంలో జగన్ విజన్, పట్టుదల చూసి వారు ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. దానికి తోడు గెలిచిన తర్వాత కూడా జగన్ పాతవి ఏవీ మనసులో పెట్టుకోకుండా అన్ని సామజిక వర్గాలకు సమానంగా న్యాయం జరిగేలా చూడడం తో వారు మరింత ఆకర్షితులయ్యారని చెప్తున్నారు.

ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత తోట త్రిమూర్తులు వంటి నేతలే జగన్ గూటికి చేరారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు, చలమలశెట్టి సునీల్ కూడా కండువాలు కప్పుకున్నారు. త్వరలో మరికొందరు నేతలు కూడా జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓవైపు కాపు కార్పోరేషన్ కి కేటాయింపులు పెంచడం, సకాలంలో నిధులు అందించడం, మరోవైపు కొత్తగా కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలను మెప్పించడంతో వైఎస్సార్సీపీకి కాపులలో ఆదరణ పెరిగిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం కాపులలో జగన్ ఓటుబ్యాంకు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆశ్చర్య పోవడం టీడీపీ వంతయ్యింది.. మరి జగన్ కి వీరి మద్దతు ఇలానే ఉంటె భవిష్యత్తు లో జగన్ ఎదురుండదు అని చెప్పాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -