తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఇప్పుడే లేనివిధంగా ప్రతిపక్షాలచే నిందించబవుతున్నారు.. కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదం, మొన్న జరిగిన శ్రీశైలం ప్రమాదం విషయం అన్ని కేసీఆర్ కావాలని చేసినట్లుగా విపక్షాలు ఒక్కసారిగా దండెత్తాయి.. కాంగ్రెస్ పార్టీ లో అంత యాక్టివ్ గా ఎవరు లేకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ని అందరికంటే ఎక్కువ గా విమర్శించడం అంతటా చర్చనీయాంశమైంది.. కేసీఆర్ సీఎం అయ్యింది ఫామ్ హౌస్ లో పడుకోవడానికి అని, పాలన మీద దృష్టి పెట్టకుండా తాగి తందానాలు ఆడుతున్నారని ఉన్నవి లేనివి అన్ని సృష్టించి కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు..
ఇక ఆ మధ్య కేసీఆర్ కొన్ని రోజులు మీడియా ముందుకు రాలేదని కేసీఆర్ కి కరోనా వచ్చిందని తెగ ప్రచారం చేశారు. ఒకానొక దశలో కరోనాకు భయపడి ఫామ్ హౌస్ కు పారిపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ఆరోపణలన్నింటిమీద సమాధానం చెప్తారు అని అందరు ఎదురుచూశారు.. కానీ ఎప్పుడు కేసీఆర్ నోరు మెదపలేదు.. అయితే వీటన్నింటికీ త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా కేసీఆర్ సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల మధ్య ఈ సమావేశం జరపడానికి అన్ని సిద్ధమవుతున్నాయి.. కేసీఆర్ కూడా పార్టీ నేతలతో సమావేశాల గురించి చర్చించారట.. ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహం రచించినట్లు తెలిసింది. ఇక ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ వేదిక గా ప్రభుత్వం వైఫల్యాలన్నీ బయటపెట్టే విధంగా సిద్ధమవుతున్నారట. చూస్తుంటే ఎప్పుడు ఏకపక్షం గా సాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిసారి ఎంతో ఉతంతా భరితంగా సాగనున్నాయని అనిపిస్తుంది..
