కమేడియన్ అలీ తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాధించుకున్నాడు. అయితే కామెడీతో అలరించే ఆలీ నోటి నుంచి వచ్చిన మాటలు విటే షాక్ కావాల్సిందే. రీసెంట్ గా ఆలీ గుంటూరులో జరిగిన ‘జాగో ముస్లిం.. చలో గుంటూరు’ అనే సభకు ముఖ్య అతిధిగా వెళ్లారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మైనార్టీల ఓట్లును ఎక్కువగా వేయించుకున్న రాజకీయ పార్టీలు తామిచ్చిన హామీల్ని నెరవేర్చటం తర్వాత.. ముస్లింలకే టోపీలు పెడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు ఇస్తుందో ఆ పార్టీకే ముస్లింలంతా ఓట్లు వేయాలని అలీ పిలుపునిచ్చారు.
రాజకీయ నాయకులు టోపిలు పెట్టుకుంటూ తిరగటమే కాదు… ముస్లింలకు టోపీలు పెడుతున్నారన్న ఆయన.. ముస్లింలు సమిష్టి కృషితో ఎదగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముస్లింలకు రాజకీయ పార్టీలు టోపీలు పెడుతున్నాయంటూ సీరియస్ అయిన అలీ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏదైన సభకు వెళితే.. అల్లరి మాటలతో.. కామెడీ తో సభలో ఉత్సాహాన్ని రేకెత్తించే అలీ.. అందుకు భిన్నంగా తాజా సభలో మాత్రం మైనార్టీల హక్కుల గురించి.. రాజకీయ పార్టీలతో ముస్లింలు ఎలా ఎదురుకోవాలన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. బలవంతపు మత మార్పిళ్లు మంచికాదన్న మాట ఆయన నోటి నుంచిరావటం గమనార్హం.
Related
