బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది సీఈసీ. ఎన్నికల కమిషన్‌ను ఛఠ్ పండుగ తర్వాత ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటూ కోరాయి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్. సాంధు, వివేక్ జోషిలతో జరిగిన సమావేశంలో ఆరు జాతీయ మరియు ఆరు రాష్ట్ర పార్టీల ప్రతినిధులు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఛఠ్ పండుగ తర్వాత తక్కువ దశల్లో నిర్వహించాలని కోరారు.
ఛఠ్ పండుగ, దీపావళి తర్వాత ఆరు రోజులకే జరుపుకునే బీహార్‌లో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈసారి అక్టోబర్ 25 నుండి 28 వరకు జరగనుంది. దీపావళి మరియు ఛఠ్ సందర్భంగా రాష్ట్రం వెలుపల పనిచేసే అనేక మంది తమ ఇళ్లకు తిరిగి వస్తారు. అందువల్ల ఆ సమయానికే ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల హాజరు శాతం పెరుగుతుందనే అభిప్రాయాన్ని పార్టీలు వ్యక్తం చేశాయి.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో మూడు దశల్లో నిర్వహించబడ్డాయి. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రస్తుతం పట్నాలో రెండు రోజుల పర్యటనలో రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతను సమీక్షిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22న ముగుస్తుంది.
సెప్టెంబర్ 30న భారత ఎన్నికల కమిషన్ (ECI) బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తుది ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది, ఇది జూన్ 24, 2025 నాటికి నమోదైన 7.89 కోట్లతో పోలిస్తే తక్కువ. పట్నాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.63 లక్షల కొత్త ఓటర్లు చేర్చబడ్డారని జిల్లా అధికారులు తెలిపారు. మధుబనీ జిల్లాలో 85,645 ఓటర్లు, నాలందా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 56,423 ఓటర్లు కొత్తగా జాబితాలో చేర్చబడ్డారు.
ప్రస్తుతం 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో,ఎన్‌డీఏకు 131 సీట్లు ఉన్నాయి. బీజేపీ: 80,జేడీయూ: 45,హెచ్‌ఏఎం(ఎస్): 4,స్వతంత్రులు: 2 ఉన్నారు. ఇక మహా ఘట్‌బంధన్‌కు 111 సీట్లు ఉండగా ఆర్జేడీ: 77,కాంగ్రెస్: 19,CPI(ML): 11,CPI(M): 2,CPI: 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.
