- Advertisement -

జయలలిత మరణ వార్త విని.. ఎంత మంది చనిపోయారంటే?

- Advertisement -
amma fans died after listening of jaya death news

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణ వార్తను అన్నాడిఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు, మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 5 న ఆమె మరణించిన తరువాత ఇప్పటివరకు 280 మంది చనిపోయినట్టు అన్నా డిఎంకే పార్టీ శనివారం ప్రకటించింది.

మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 3 లక్షల పరిహారం అందించనున్నట్టు పార్టీ ప్రకటించింది. గతంలో 77 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా చెన్నై, వెల్లూర్, తిరువళ్లూర్, తిరువన్నమలై, కుడ్డలూర్, క్రిష్ణగిరి, ఎరోడ్, తిర్పూర్ జిల్లాలలోనే జయలలిత అభిమానులు, మధ్దతుదారులు ఎక్కువగా మృతిచెందినట్లు వివరించారు.

సెప్టెంబర్ 22న తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత సోమవారం రోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలో ఇంటికి తిరిగి వెళ్లనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో గుండెపోటు రావడంతో ఆరోగ్యం క్షీణించి ఆమె కన్నుమూయడంతో జయ ఇక లేరన్న ఈ నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నాడీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related

  1. జయలలిత గా రమ్యకృష్ణ!
  2. ICU లో జయలలిత ఏం చేసేవారు . . లీక్ అయిన సీక్రెట్
  3. శోభన్‌బాబు, జయలలితల మధ్య సంబంధంకు కారణం ఇదే!
  4. జయలలిత.. పెద్ద మనసు.. గురించి తెలిస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -