Saturday, May 4, 2024
- Advertisement -

త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయి : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

- Advertisement -

దేశంలో చమురు ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో రాజస్థాన్ సహ పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు సెంచరీ కొట్టాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు నమోదుకాని రీతిలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరిగి వినియోగదారల నడ్డి విరుస్తున్నాయి. అలాగే, నిత్యావసరాలు, వంట నూనెల ధరలు సైతం పెరుగుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ.. శీతాకాలం ముగిసిన అనంతరం నుంచి పెట్రోల్ ధరలు తగ్గుతాయని వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతోనే దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజల పై భారం పడుతున్నదని వివరించారు.

వేటికైనా సరే డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడానినకి డిమాండ్ అధికంగా ఉండటమే కారణమని తెలిపారు. శీతాకాలం ముగిసిన తర్వాతి నుంచి పెట్రోల్ ధరలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాలంలో పెట్రోల్, డిజిల్ కు అధికంగా డిమాండ్ ఉంటుందని వివరించారు. అయితే, ధరల పెరుగుతుంటే కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -