- Advertisement -

అతని మరణానికి తట్టుకోలేకపోతున్నా.. తీవ్ర భావోద్వేగానికి గురైన మహేష్ బాబు!

- Advertisement -

శుక్రవారం వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. థియేటర్ల ముందు ఎంతో సందడి నెలకొనేది. సెలబ్రిటీలు,క్రిటిక్స్ కోసం ప్రసాద్ ల్యాబ్స్, ఐమాక్స్ ఇతర థియేటర్స్‌లో స్పెషల్ షోలు నిర్వహించేవారు. థియేటర్ల ముందు ఎవరు ఉన్నా లేకపోయినా నిర్మాత, పిఆర్ఓ బి .ఏ రాజు మాత్రం థియేటర్ల ముందు ఉండి అక్కడికి వచ్చే సినిమా జర్నలిస్టుల అందరిని ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పలకరించేవారు.

ఇకపై థియేటర్ల ముందు ఆ నవ్వులు కనిపించని, నిర్మాత బి ఏ రాజు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతో షాక్ కి గురిచేసింది. బి .ఏ రాజు మరణ వార్తను విన్న ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది. శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. బి. ఏ రాజుకు ఇద్దరు కుమారులు.ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు.

Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?

బి. ఏ రాజు మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా బి.ఏ.రాజు తో ఉన్న అనుబంధం గురించి తెలుపుతూ సంతాపాన్ని ప్రకటించారు.‘బి.ఏ.రాజు గారు ఆకస్మిక మరణం ఊహించలేనిది. ఆయన మరణ వార్తని తట్టుకోలేకపోతున్నాం.. చిన్నప్పటినుంచే అతనితో కలిసి ప్రయాణం చేశాను. సినిమా పట్ల ఎంతో మక్కువ కలిగిన పెద్దమనిషి. మా కుటుంబంతో బి.ఏ రాజు గారికి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. అంటూ మహేష్ బాబు బి. ఏ రాజు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also read:అను ఇమాన్యుల్ కు నెటిజెన్ వింత ప్రపోజల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -