విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిపైనరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మేజర్ ప్లాంట్ లో బ్లాస్ట్ అయినట్లు భావిస్తున్నారు. సైరన్ మోగడంతో తాము బయటికి వచ్చేశామని కార్మికులు తెలిపారు.
సహాయక చర్యల్లో హెచ్ పీసీఎల్, అగ్నిమాపక సిబ్బందితో పాటు నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సర్లు సవ్యంగా పనిచేయడంతో పెనుముప్పు తప్పినట్టు భావిస్తున్నారు. తాజాగా ఈ ప్రమాదం పై స్పందించారు కలెక్టర్ వినయ్ చంద్. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అరగంటలో అదుపులోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.
హెచ్పిసిఎల్ ప్రమాదం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు.
నటుడు చంద్రమోహన్ పై రూమర్లు.. కొట్టి పడేస్తున్న సన్నిహితులు!
