Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ దిల్లీ పర్యటన వాయిదా.. కారణం అదేనా?

- Advertisement -

ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. సోమవారం ఆయన ఢిల్లీలో పర్యటించాల్సి ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెల్లాల్సి ఉండగా.. ఆయన అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో జగన్ హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యల గురించి చర్చించాలని సీఎం జగన్ భావించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు కార్యక్రమాలతో బిజీగా బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సోమవారం ఏపీ సీఎం జగన్‌కు ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదని సమాచారం. అందుకే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ల లభ్యతపై ఇతర రాష్ట్రాల సీఎంలను జగన్ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేస్తామని చెప్పినా, వారికి వ్యాక్సిన్‌లు ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం ఇచ్చే టీకాలు సరిపోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే టీకాలు వేయాలని జగన్ భావించారు. అందుకోసం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచారు.

సీఎంలంతా ఒకే మాట మీద ఉండాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల జగన్ లేఖ రాశారు. ఈ విషయం చర్చించేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్దమైనట్లు సమాచారం. ఈ వారంలో అమిత్ షా అపాయింట్‌మెంట్ కచ్చితంగా లభిస్తుందని, అప్పుడు జగన్ ఢిల్లీ వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం.

నేటి పంచాంగం,సోమవారం(07-06-2021)

అక్కడ సినిమా షూటింగ్స్ కి పరిమిషన్

వీలైనంత వరకు మాంసం తగ్గించండి అంటున్న.. స్టార్ హీరోయిన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -