Sunday, April 28, 2024
- Advertisement -

ఎమ్మెల్యేల మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో జగనన్న సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వంపై సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరైయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే టికెట్లు ఇస్తానని, పనితీరు బాగోలేని వారికి సీట్లు ఇవ్వలేనని ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ గ్రాఫ్ పెంచుకోవాలని… గ్రాఫ్ బాగోలేని వారిని కొనసాగించడం కుదరదని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.

సర్వేల్లో అనుకూలంగా లేని వారిని కూడా కొనసాగించడం కుదరదని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టమని చెప్పారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. రానున్న 9 నెలలు అత్యంత కీలకమని జగన్ అన్నారు. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని చెప్పారు. ఏయే పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. వచ్చే సమావేశానికి పనితీరును మెరుగుపరుచుకుని రావాలని అన్నారు. పనితీరు బాగోలేని వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. అందరూ కష్టపడి 175కి 175 సీట్లను గెలుచుకుందామని చెప్పారు.

ఈ సమావేశంలో 15మంది ఎమ్మెల్యేల పనితీరు అనుకూలంగా లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరనేది వ్యక్తిగతంగా రిపోర్టులు పంపిస్తామని వెల్లడించినట్లు సమాచారం. ప్రజల్లో అనుకూల పవనాలు లేని ఎమ్యెల్యేలకు తిరిగి టికెట్లు రాకపోతే తనను బాధ్యున్ని చేయకూడదని కూడా స్పష్టం చేసినట్లు నేతలు చెప్పుతున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జరుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -