బాలయ్యబాబు.. బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ కావడంతో.. బోయపాటి కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావించినప్పటికీ బాలయ్య మార్కెట్ దృష్ట్యా తగ్గించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు చాలా రోజులు బాలయ్య బాబుతో నటించేందుకు టాప్ హీరోయిన్లు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ఎంతో అలరించింది.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.. తొలిసారిగా అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. అఖండను మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోన్నట్టు సమాచారం.
అఖండలో శ్రీకాంత్ విలన్ గా కనిపిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ మూవీ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ తర్వాత బాలయ్య .. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీలో నటించబోతున్నాడు. ఈ సినిమాను దసరా రేసులో కేరళ తీయాలని ప్లాన్ చేసినా ఆ సమయంలో పుష్ప ఆచార్య తో పాటు మరి కొన్ని సినిమాల పోటీ పడుతుండడంతో ఒంటరిగా థియేటర్ లోకి వచ్చేందుకు ఈ సినిమాను వినాయక చవితి పండుగ సమయంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read
