బాలయ్యకు నో చెప్పిన టబు.. అందుకేనా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కూలీ నెం.1 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ టబు తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు లో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో ఆ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు.. దాంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని చూసినా అప్పటికే ఇతర హీరోయిన్లు రావడంతో పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన హీరోయిన్లు దొరకడం లేదని ఫిల్మీ టాక్.

నయనతార లాంటి సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం కోలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇక అనుష్క లాంటి హీరోయిన్లు దాదాపు సినిమాలు పూర్తిగా తగ్గించారన్న విషయం తెలిసిందే. త్రిష విషయానికి వస్తే గత కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు గోపిచంద్ మలినేని త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ మూవీ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ‘టబు’ను సంప్రదించాడట.

- Advertisement -

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను చేయలేనని చెప్పి ఆమె సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. గతంలో బాలకృష్ణ సరసన టబు ‘చెన్నవకేశవ రెడ్డి’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ కాంబినేషన్ తెరపై కనిస్తే బాగుంటుందని భావించారట దర్శకులు గోపిచంద్ మలినేని. మరోవైపు బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రుతిహాసన్ .. ఓ కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక జరిగిపోయిందనే టాక్ వినిపిస్తూనే ఉంది.

మాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కలకలం.. దర్శకనిర్మాతలపై నటి రేవతి సంచలన వ్యాఖ్యలు!

డూప్ లేకుండ హీరో విశాల్ ఫైట్.. తృటిలో తప్పిన ప్రమాదం

నాన్నకు ఆ విషయం ఇంకా తెలీదు.. నిహారిక షాకింగ్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -