- Advertisement -

టీమిండియా కోచ్ గా ధోని.. ఐపీఎల్ కు గుడ్ బై?

- Advertisement -

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎం‌ఎస్ ధోని గురించి ప్రత్యకంగా చెప్పవలసిన అవసరం లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ వరల్డ్ కప్పులు సాధించిన ఏకైక కెప్టెన్ గా తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. అయితే ధోని బ్యాట్స్ మెన్ గా నెలకొల్పిన రికార్డుల కన్నా కెప్టెన్ గా జట్టుకు అతడు అందించిన విజయాలే ఎక్కువ. కెప్టెన్ కూల్ గా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరైన వ్యూహాలను అమలు పరచడంలో ధోనీకి మరే కెప్టెన్ కూడా సాటిరాడు.

అలాంటి ధోని టీమిండియా కు గుడ్ బై చెప్పిన తరువాత.. జట్టులో కెప్టెన్సీ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ధోని తరువాత కెప్టెన్సీ భాద్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టును నడిపించడంలో పరవలేదనిపించినప్పటికి, బీసీసీఐ కోహ్లీ మద్య నెలకొన్న పరిణామాల కారణంగా విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక కోహ్లీ తరువాత సారథ్య బాద్యతలు చేపట్టిన రోహిత్ శర్మ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జట్టును నడిపించడంలో విఫలం అవుతున్నాడు. ఇక ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీ లోపం స్పష్టంగా కనిపించింది. దాంతో ఎం‌ఎస్ ధోని కెప్టెన్సీ ను గుర్తు చేసుకుంటున్నారు క్రీడా అభిమానులు. అయితే ప్రస్తుతం క్రీడా విభాగాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధోని మళ్ళీ టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉందట.

అయితే మళ్ళీ ఆటగాడిగా కాదండోయ్ ! ఈసారి కోచ్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈసారి ఐపీఎల్ కు ధోని రిటైర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన తరువాత బీసీసీఐ ఎం‌ఎస్ ధోనీకి కోచ్ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వరుసగా మెగా టోర్నీలలో ఘోరంగా విఫలం అవుతూ వస్తోంది. దాంతో టీమిండియాను గాడిన పెట్టలంటే ధోని వస్తేనే సాధ్యం అనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా కొనసాగుతున్నారు. మరి ధోని టీమిండియా కోచ్ గా వస్తే రాహుల్ ద్రావిడ్ ను పక్కన పెట్టేసినట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -