- Advertisement -

చంద్రబాబు బెయిల్ పిటిషన్లు వాయిదా!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయినా చంద్రబాబు 14 రోజుల రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక జైలు నుండి బయటికి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే పలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వాటిని వాయిదా వేసింది న్యాయస్థానం.

తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ని ఎల్లుండికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, లండన్‌ నుంచి వర్చువల్‌గా‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇక సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపి్తూ గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో చంబునాథ్‌ మిశ్రా కేసును ప్రస్తావనకు తెస్తు క్వాష్ పిటిషన్‌కు చంద్రబాబుకు అనర్హుడంటూ వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉన్న తరుణంలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన వెంటనే బాబును అరెస్ట్ చేయలేదని…రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశామని వెల్లడించారు.పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి క్వాష్ పిటిషన్‌ని కొట్టివేయాలని..సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయిన వేయొచ్చు, ఎంతమంది సాక్ష్యులను అయినా చేర్చవచ్చని తెలిపారు ముకుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -