- Advertisement -

చంద్రబాబు కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదా?

- Advertisement -

52 రోజుల రిమాండ్ తర్వాత మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. అయితే కండీషన్స్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇందులో ప్రధానంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన కూడదని,ప్రెస్ మీట్ పెట్టొందని వెల్లడించింది.

అయితే జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఈ విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. తనని చూడటానికి వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసగించిన బాబు…తన అరెస్ట్ తర్వాత బయట జరిగిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలిలో చేసిన ఆందోళనను సైతం ప్రస్తావించారు.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు మద్దతు తెలుపి, రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటించి, పూజలు చేసిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. జనసేనతోపాటు బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌, కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం తనకు సంఘీభావం ప్రకటించారని..వారందరికి థ్యాంక్స్ చెప్పారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు తుంగలో తొక్కారని వాదన వినిపిస్తోంది. చంద్రబాబు విడుదల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకోగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్ట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -