సుజీత్ దర్శకత్వంలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ఓజీ. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. దాదాపు 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు దర్శకుడు సుజీత్. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది దసరాలోగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అందుకే బిజినెస్ డీల్స్ ఒక్కొక్కటి క్లోజ్ చేస్తూ వస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఓజీతో పాటు పవన్ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. పవన్ నటించిన హరిహరవీర మల్లుతో పాటు పలు సినిమాలు వెంటవెంటనే ఒక్కొక్కటి రిలీజ్ కానున్నాయి.
