మధుమేహం లేదా డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిని కలవర పెడుతోంది. రోజురోజుకు మధేమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే బయటపడటం కష్టం.
అయితే పురుషుల్లో కంటే మహిళల్లోనే ఈ సమస్య అధికంగా ఉంటోంది. మహిళల్లో ఈస్ట్రోజన్ అసమతుల్యత, రోగనిరోధక శక్తి లోపించడం, ఐరన్ లోపం వంటివి స్త్రీలలో డయాబెటిస్ పెరఫడానికి కారణం అవుతోంది. అలాగే నెలసరి సమయంలో వచ్చే ఆరోగ్య మార్పులు కూడా డయాబెటిస్ పెరగడానికి కారణమవుతోంది.
డయాబెటిస్ కారణంగా మహిళల్లో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత, నరాల బలహీనత, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు చూపు మందగించడం, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్ సమస్యలకు లోనవుతున్నారు. డయాబెటిస్ కారణంగా మహిళల్లో వెజైనా ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే లైంగిక ఆసక్తి తగ్గడం, సంతాన సామర్థ్యం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
డయాబెటిస్‌ను తగ్గించడం కష్టమే కావొచ్చు కానీ తేలికపాటి వ్యాయామం చేస్తే కంట్రోల్ చేయవచ్చు. ఆకుకూరలు,స్ట్రాబెరీ, అవకాడో వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి. అంతేగాదు నీరు ఎక్కువగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ ఉండే పానీయాలను సేవిస్తే ఆనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.
