- Advertisement -

వాలంటీర్లు రావాలంటే…ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలి

- Advertisement -

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ తిరిగి రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు సీఎం జగన్. శుక్రవారం నరసాపురం రోడ్ షోలో మాట్లాడిన జగన్..చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రావని, మళ్లీ ప్రజలను మోసం చేస్తాడన్నారు.

ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ అని.. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 పార్లమెంట్ సీట్లు వైసీపీ గెలిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలని సెటైర్ చేశారు.అలాగే తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలంటూ పవన్‌కు చురకలు అంటించారు.

చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకొస్తుందా? ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు సంక్షేమ పథకాలను ఏనాడూ అమలు చేయలేదన్నారు. పేదవాడికి రూ. 25లక్షల ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణ రక్షణ కల్పించింది మీ బిడ్డ జగన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -