గుంటూరు పార్లమెంట్…టీడీపీ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుండి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు గల్లా జయదేవ్. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు జయదేవ్. దీంతో టీడీపీ తరపున బరిలో ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. వైసీపీ తరపున కిలారి రోశయ్య పోటీ చేస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి పోటీకి దూరం కావడం టీడీపీ ప్రతికూలంగా మారింది. గుంటూరు పార్లమెంటు పరిధిలో గుంటూరు ఈస్ట్, వెస్ట్ , తెనాలి,ప్రతిపాడు, తాటికొండ పొన్నూరు,మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయి.
78.81% పోలింగ్ తాజా ఎన్నికల్లో నమోదుకాగా ముస్లిం ఓట్లతో పాటు కమ్మ, కాపు ఓటు బ్యాంకుఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఈ పార్లమెంట్ పరిధిలో నమోదుకాగా అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు మూడు రాజధానులు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వైసిపి ఎన్నికల క్యాంపెయిన్ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన అందాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా టీడీపీ చ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.
