రాజ్ తరుణ్ -లావణ్య – మాల్వి మల్హోత్రా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్. ముంబై పోలీస్ స్టేషన్ కు చేరింది ట్రై యాంగిల్ స్టొరీ. రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది లావణ్య. అనంతరం ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయగా మీరే పరిష్కరించుకోండని చెప్పారు పోలీసులు.
ముంబైలోని ఓ ఇంట్లో మాళవితో రాజ్ తరుణ్ కలిసి ఉండగా పక్కా ప్లాన్ వేసి పట్టుకున్నారు లావణ్య. ఈ క్రమంలో మాల్వీ – లావణ్య మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజ్‌ను తనకు అప్పగించాలంటూ మాల్వితో గొడవకు దిగారు లావణ్య.
ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఛార్జ్ షీట్లో రాజ్ తరుణ్‌ను నిందితుడిగా చేర్చగా రాజ్‌తరుణ్ ..లావణ్యతో సహజీవనం చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
పదేళ్లు సహజీవనం చేశారని..రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నారు రాజ్ తరుణ్.
