- Advertisement -

భారత్‌ టూర్‌కు విండీస్..టీమ్ ఇదే!

- Advertisement -

రాబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సిరీస్ కోసం వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి భారత్‌తో జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేశారు. ఈ సిరీస్, జూన్–జూలై 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన హోం సిరీస్‌ తరువాత, రాస్టన్ చేస్ నాయకత్వంలోని జట్టుకు రెండవ అసైన్‌మెంట్‌గా నిలవనుంది.

మొదటిసారిగా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు ఖారీ పియెర్. ఎడమచేతి స్పిన్నర్ అయిన ఆయన ఈ సీజన్‌లో వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 41 వికెట్లు (సగటు 13.56) తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు.

ఇక టాగెనరైన్ చందర్పాల్ మరియు అలిక్ అథనేజ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. చందర్పాల్ 10 టెస్టుల్లో 560 పరుగులు సాధించారు. ఆయన చివరిసారిగా 2024 జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడారు. అథనేజ్ మాత్రం ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో చివరిసారి ఆడారు.

జట్టులో మార్పులపై హెడ్ కోచ్ డారెన్ సమి స్పందిస్తూ.. మా టాప్ ఆర్డర్‌లో ఇటీవల ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని టాగెనరైన్ చందర్పాల్‌ను తిరిగి తీసుకున్నాం. అలాగే స్పిన్ బౌలింగ్‌కి ఎదుర్కొనే నైపుణ్యం కారణంగా అథనేజ్‌కు అవకాశం కల్పించాం…ఖారీని తొలిసారి రెండవ స్పిన్నర్‌గా చేర్చాం. భారతదేశంలో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నాం అన్నారు. ఉపఖండంలో ఆడడం ఎప్పుడూ ఒక సవాల్… ఈ పరిస్థితుల్లో పోటీగా నిలిచేలా జట్టును ఎంపిక చేశాం అని అన్నారు.

వెస్టిండీస్ జట్టు:

రాస్టన్ చేస్ (కెప్టెన్), జొమెల్ వారికాన్, కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనేజ్, జాన్ క్యాంప్‌బెల్, టాగెనరైన్ చందర్పాల్, జస్టిన్ గ్రీవ్స్, షై హోప్, టెవిన్ ఇమ్లాక్, అల్‌జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియెర్, జేడెన్ సీల్స్.

సిరీస్ షెడ్యూల్:

1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

2వ టెస్ట్: అక్టోబర్ 10–14, అరుణ్ జేట్లీ స్టేడియం, ఢిల్లీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -