- Advertisement -

వైసీపీ ఎంపీ ఫిర్యాదుపైజాతీయ ఎస్సీ కమిషన్

- Advertisement -

తిరుపతి ఎంపీ, వైసీపీ నేత గురుమూర్తి ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ సత్వరంగా స్పందించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించమని ఆదేశిస్తూ, నివేదికలో ఎఫ్.ఐ.ఆర్ వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు, అరెస్టులు, చార్జ్ షీట్ స్థితి తదితర సమాచారం ఇవ్వాలనీ ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

దేవళంపేట అంబేడ్కర్ విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు ఎంపీ గురుమూర్తి. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇది కేవలం విగ్రహ ధ్వంసం మాత్రమే కాదు, దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులపై నేరుగా దాడి అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -