- Advertisement -
సుహాస్ విలన్‌గా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం మండాడి. సుహాస్‌కు ఇది తమిళంలో తొలి సినిమా కాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.
ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రామనాథ పురం జిల్లా తొండి సముద్రతీర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విలన్‌గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
